ముందస్తు ఆస్తి పన్ను చెల్లించిన మధుసూదన్ రెడ్డి
MNCL: 2026- 27 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లా స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధి వి. మధుసూదన్ రెడ్డి తమ స్థిరాస్తికి సంబంధించి ముందస్తు ఆస్తి పన్ను రూ. 3,48,000 బుధవారం చెల్లించి రసీదులు పొందారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజలు ముందస్తు ఆస్తి పన్ను చెల్లించి పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.