'అంగన్వాడి వేతనాలు పెంచాలి'

'అంగన్వాడి  వేతనాలు పెంచాలి'

NDL: పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్‌కు వేతనాలు పెంచాలని అంగన్వాడి వర్కర్స్ జిల్లా కోశాధికారి ఎస్తేరమ్మ డిమాండ్ చేశారు. గురువారం ఈ మేరకు ప్యాపిలి తహసీల్దార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. అధికారంలోకి వస్తే అంగన్వాడి వర్కర్స్‌ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని మాట ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం దాటిన అమలు చేయలేదని తెలిపారు.