నకిలీ మద్యం కేసు.. 'మేము విచారణకు సిద్ధం'
అన్నమయ్య: నకిలీ మద్యం కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని తంబళ్లపల్లె(M) కన్నెమడుగుకు చెందిన రామకృష్ణ రెడ్డి, రవిశంకర్ రెడ్డి (బాబు బ్రదర్స్) స్పష్టం చేశారు. కేసులకు భయపడి తాము పారిపోయామంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు దుష్ప్రచారాలని వారు అన్నారు. తప్పు చేసినవారే పరారీలో ఉన్నారని, తాము కన్నెమడుగులోనే ఉన్నామని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని వారు తెలిపారు.