VIDEO: వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు
MDK: వెల్దుర్తి మండలం ఎల్కపల్లి నూతన గ్రామపంచాయతీ పరిధిలో శనివారం పాలకవర్గం సమావేశం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పావని అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి వార్డు సభ్యులు, అధికారులు హాజరయ్యారు. గ్రామంలో నెలకొన్న సమస్యలపై సమావేశంలో చర్చించారు. వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో త్రాగు నీరు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.