విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక

విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక

జగిత్యాల పట్టణంలోని నూకపెల్లి డబుల్ బెడ్ రూమ్ కాలనీలో ఆదివారం విద్యుత్ సమస్యల పరిష్కార వేదికను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాలనీలోని రోడ్ నెంబర్ 10 పార్క్‌లో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. విద్యుత్ వినియోగం, విద్యుత్ సమస్యల పరిష్కారానికి గల సందేహాలను అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.