వేసవి దృష్ట్యా ప్రత్యేక చర్యలు

వేసవి దృష్ట్యా ప్రత్యేక చర్యలు

VSP: వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని వాల్తేర్ డివిజన్ పలు చర్యలు చేపట్టింది. ప్రధాన స్టేషన్లలో తాగునీటి సరఫరాకి ఏర్పాట్లు చేశాయి. విశాఖ, విజయనగరం, దువ్వాడ తదితర స్టేషన్లలో ప్రత్యేక బూత్‌లు ఏర్పాటు చేశారు. ప్లాట్‌ఫాంలలో క్యూ మేనేజ్‌మెంట్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల వద్ద రద్దీ నియంత్రణపై దృష్టి పెట్టారు. ఈ మేరకు విశాఖ స్టేషన్‌లో మాక్ డ్రిల్ నిర్వహించారు.