డాగ్ స్క్వాడ్ తనిఖీలు.. పేలిన బాంబు
ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ బాంబు పేలుడు సంభవించింది. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తుండగా.. ఒక్కసారిగా బాంబు పేలిన ఘటన కరిగుండం శివారులోని అటవీ ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో K9 డాగ్ స్క్వాడ్‌కు చెందిన జవాన్ ఫిరోజ్ ఖాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స కోసం అధికారులు అతడిని ఎయిర్ లిఫ్ట్ చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.