విజయవాడలో కలకలం రేపుతున్న హత్యలు

విజయవాడలో కలకలం రేపుతున్న హత్యలు

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వరుస హత్యలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవల విజయవాడ ఎన్టీఆర్ కాలనీలో బంగారం కోసం ఇంటి యజమాని రామారావును పనిమనిషి మంగ హత్య చేసిన ఘటన మరువక ముందే, నిన్న కంకిపాడులో స్వర్ణకుమారి అనే వృద్ధురాలిని బంగారు నగదు కోసం దుండగులు హత్య చేశారు. ఈ రెండు ఘటనలు బంగారం కోసమే జరగడం ఆందోళనకు గురి చేస్తోంది.