వెలిగండ్లలో సమీక్ష నిర్వహించిన విద్యుత్ శాఖ ఈఈ
ప్రకాశం: వెలిగండ్ల మండల కేంద్రంలో కనిగిరి డివిజన్ విద్యుత్ శాఖ ఈఈ ఉమాకాంత్ సెక్షన్ సిబ్బందితో గురువారం సమీక్ష నిర్వహించారు. విద్యుత్ బిల్లు బకాయిలు వసూలు చేయాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఏకాగ్రతతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పామూరు బీఈఈ కృష్ణారెడ్డి, ఏఈ రసూల్, సిబ్బంది పాల్గొన్నారు.