ఓయూ వేదికగా సీఎం హామీ ఇవ్వాలి: TDSF విజయ్ నాయక్

ఓయూ వేదికగా సీఎం హామీ ఇవ్వాలి: TDSF విజయ్ నాయక్

HYD: ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించేందుకు వచ్చే సీఎం రేవంత్ రెడ్డి రూ.1000 కోట్ల జీవోను ప్రకటించాలని టీడీఎస్ఎఫ్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ నాయక్ డిమాండ్ చేశారు. ఓయూ వేదికగా అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించేలా హామీ ఇవ్వాలన్నారు. పెండింగ్‌లోని స్కాలర్షిప్‌లను విడుదల చేయాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని సూచించారు.