కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్షుడికి సన్మానం
PDPL: ధర్మారం మండలం నంది మేడారం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లింగారెడ్డిని ధర్మపురి కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. లింగారెడ్డి రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నికై ధర్మపురి కోర్టును సందర్శించిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.