ఎమ్మెల్యే గుమ్మనూరును కలిసిన పలు గ్రామస్థులు

ATP: గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను ఎన్ కొట్టాల, నరసాపురం గ్రామాల ప్రజలు కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని, తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. గ్రామాల అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.