పరిశ్రమ త్వరగా తెరవాలని ప్రత్యేక పూజలు

VZM: జిందాల్ కంపెనీ టీఎన్‌టీయూసీ అధ్యక్షులుగా ఎన్నికైన లెంక శ్రీను తుమ్మికాపల్లిలో ఉన్న దుర్గమ్మ ఆలయంలో కార్మికులతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయన మాట్లాడుతూ.. అప్పన్నపాలెంలో ఉన్న జిందాల్ పరిశ్రమ త్వరగా తెరవాలని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే కార్మికులు కుటుంబాలతో సుఖసంతోషాలతో ఉండాలని దుర్గమ్మను వేడుకున్నారన్నారు.