బాబా శతజయంతి వేడుకలకు రూ.10 కోట్లు మంజూరు
సత్యసాయి: సత్యసాయి బాబా 100వ జయంతి వేడుకలను నవంబర్ 23 పుట్టపర్తిలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి పనుల నిమిత్తం ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులు, పనుల సమన్వయ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీఏ) సీఈవోకు అప్పగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.