VIDEO: సీసీ రోడ్డు నిర్మాణంలో లోపించిన నాణ్యత

WNP: చిట్యాల రోడ్డు డబుల్ బెడ్ రూమ్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్డు పనులలో నాణ్యత లోపించింది. శుక్రవారం ఓ టిప్పర్ సీసీ రోడ్డులో ఇరుకపోవడంతో నాణ్యత పాటించడంలేదని కాలనీవాసులు కాంట్రాక్టర్‌ను నిలదీశారు. అధికారులు స్పందించి కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు చేపట్టాలని కాలనీ కమిటీ సభ్యుడు బలరాం వెంకటేష్ కోరారు.