VIDEO: అగ్ని ప్రమాదంలో ధాన్యం దగ్ధం

WGL: రాయపర్తి మండలం కొత్తూరులో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 15 బస్తాల ధాన్యం దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. రైతు బీమాని శ్రీనివాస్ నూర్పు చేసిన ధాన్యం కల్లంలో ఉంచాడు. శనివారం గుర్తుతెలియని వ్యక్తులు వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో ప్రమాదవశాత్తు నిప్పు ధాన్యం రాశులకు అంటుకొని 15బస్తాల వరకు ధాన్యం, గడ్డి దగ్ధమైనట్లు రైతు తెలిపాడు