జాతీయ రహదారిపై వ్యక్తి మృతదేహం లభ్యం
సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక పిల్లలమర్రి సమీపంలో ఖమ్మం జాతీయ రహదారి పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. అటుగా వెళుతున్న స్థానికులు ప్రయాణికులు మృతదేహాన్ని చూసి సూర్యాపేట రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడ, లేక హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. దీనీపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.