రోడ్డు ప్రమాదం.. ఉపాధ్యాయుడి మృతి
సత్యసాయి: జిల్లా అమడగూరు జె.కే పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్‌జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న హరి(37) రోడ్డు ప్రమాదంలో ఆదివారం రాత్రి మృతిచెందారు. వ్యక్తిగత పని నిమిత్తం చినగానిపల్లి నుంచి ఓడీ చెరువుకు ద్విచక్ర వాహనంలో వెళుతుండగా, అమడగూర గ్రామ సమీపంలో ట్రాక్టర్ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలంలోనే ఆయన మృతి చెందారు.