నేపాల్ ఎన్నికలు.. ఓలీకి ఎదురుదెబ్బ
నేపాల్ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఫలితాల్లో ప్రముఖ రాపర్ బలేంద్ర షా నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 36 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఇక మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని CPN-UML పార్టీ వెనుకంజలో ఉంది. బ్యాలెట్ పేపర్లను లెక్కిస్తున్న కారణంగా 165 స్థానాల పూర్తి స్థాయి ఫలితాలు రావడానికి మరో రెండు రోజులు పట్టవచ్చు.