ప్రారంభమైన కుస్తీ పోటీలు
SRD: కంగ్టి శివారులోని శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు ప్రారంభమయ్యాయి. అంతకుముందు స్థానిక ఆలయంలో సిద్దేశ్వర స్వామికి ఈవో శివ రుద్రప్ప, నిర్వాహకులు పూజలు చేశారు. తొలుత చిన్నపిల్లలతో కుస్తీ పోటీలు నిర్వహించారు. ఇందులో గెలుపొందిన పిల్లలకు కొబ్బరికాయలు, చక్కెర పేర్లు బహుమతులను అందజేశారు. ఇందులో సర్పంచ్ కృష్ణ ఉన్నారు.