రేపటి నుంచి తొలి విడత నామినేషన్లు
TG: తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో రేపటి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు గ్రామాల బాట పడుతున్నారు. రిజర్వేషన్ ఆధారంగా పార్టీ అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. మెజార్టీ గ్రామాల్లో ఏకగ్రీవం కోసం చర్యలు ప్రారంభించారు. ఇందుకు గ్రామాల అభివృద్ధికి నజరానా కూడా ప్రకటిస్తున్నారు.