కుష్టి వ్యాధిపై అవగాహన సదస్సు

కుష్టి వ్యాధిపై అవగాహన సదస్సు

కృష్ణా: బాపులపాడు మండలం బండారగూడెం గ్రామంలో ఇవాళ ఉదయం కుష్టి వ్యాధి, చర్మంపై మచ్చలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరవల్లి హెల్త్ సెంటర్ అధికారి ఎన్.ఎం. పద్మావతి, ఆశా కార్యకర్త నాగమణి, అంగన్వాడి కార్యకర్తలు, గ్రామస్తులు, సీపీఎం నాయకుడు బర్రె లెనిన్ పాల్గొన్నారు. అనంతరం వారు కుష్టి వ్యాధి లక్షణాలు, నివారణ మార్గాలపై అవగాహన కల్పించారు.