డయాబెటిస్‌పై అవగాహన ర్యాలీ

డయాబెటిస్‌పై అవగాహన ర్యాలీ

KMM:  ఖమ్మంలో ఐఎంఏ (IMA) ఆధ్వర్యంలో డయాబెటిస్ (మధుమేహం) నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. సైబర్ క్రైమ్ డీఎస్పీ మాట్లాడుతూ.. సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డీఎస్పీ ప్రజలకు సూచించారు.