వంశధార కాలువ భూముల ఆక్రమణపై ఫిర్యాదు

SKLM: టెక్కలి మండలం గోపీనాథ్‌పురం గ్రామంలోని వంశధార కాలువలపై ఉన్న ఆక్రమలు తొలగించాలంటూ టెక్కలి RDO కృష్ణమూర్తికి ఆ గ్రామస్థులు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ కాలువపై సుమారు 200 ఎకరాల ఆయకట్టు ఉందని, రైతులందరూ కాలువ నీటిపై ఆధారపడి పంటలు పండిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొంతమంది ఆక్రమణదారులు వంశధారకాలువ భూములను ఆక్రమించారన్నారు.