రాయచోటిలో ఘనంగా ప్రారంభమైన కళా ఉత్సవ్-2025

అన్నమయ్య: రాయచోటిలోని డైట్‌లో గురువారం జిల్లా స్థాయి కళా ఉత్సవ్- 2025 పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల కళాత్మక ప్రతిభను, సృజనాత్మకతను పెంపొందించే లక్ష్యంతో గాత్ర, వాద్య సంగీతం, నృత్యం, నాటకం, దృశ్యకళలు, కథాకథనం వంటి ఆరు విభాగాల్లో రెండు రోజులపాటు 12 అంశాలపై పోటీలు జరుగుతున్నాయి.