ఘనంగా కామ్రేడ్ కారల్ మార్క్స్ జయంతి

NDL: నందికొట్కూరు పట్టణంలోని MCPI(U)కార్యాలయం నందు కారల్ మార్క్స్ 205వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కన్వీనర్ పి.లాజారేస్ కామ్రేడ్ కారల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. డివిజన్ కార్యదర్శి లింగాల శ్రీనివాసులు, కార్యకర్తలు నాగలచ్చమ్మ, సంజమ్మ, సరోజమ్మ, లెనిన్ తదితరులు పాల్గొన్నారు.