మార్చి 30న ఛలో నర్సీపట్నం
AKP: నర్సీపట్నంలో సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలిట్ భ్యూరో సభ్యులు శంకర్ మాట్లాడుతూ.. రాష్ట ప్రభుత్వం కార్పోరేట్లకు ఆదానీ, అంబానీలకు కట్టబెట్టే విధానానికి వ్యతిరేకంగా పోరాడటానికి సమాయత్తం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివాసీ హక్కల కోసం మార్చి 30న ఛలో నర్శీపట్నం ముట్టడి ఉంటుందన్నారు.