VIDEO: పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
NRML: నేటి నుంచి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలలో భాగంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల నిర్మల్ పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరపున పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వీరి వెంట ఏఎస్పి సాయికిరణ్ తదితరులు ఉన్నారు.