డాగ్ స్క్వాడ్ తనిఖీలు

MHBD: కేంద్రం ప్రభుత్వం దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ ఆదేశాల మేరకు జిల్లాలోని బస్ స్టేషన్, రైల్వే స్టేషన్‌తో పాటు పలు ప్రధాన కూడలిలో పోలీస్ సిబ్బంది డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.