సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలకు క్షీరాభిషేకం

సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలకు క్షీరాభిషేకం

కృష్ణా: బాపులపాడులో బీసీ సంఘాల నేతలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ఆదివారం రాత్రి క్షీరాభిషేకాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10% మద్యం దుకాణాలు, బార్ల లైసెన్సులను గీత కార్మికులకు కేటాయించినందుకు హర్షం వ్యక్తం చేశారు. బీసీల అభ్యున్నతే సీఎం ఎజెండా అని, వారి సంక్షేమానికి టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నాయకులు పేర్కొన్నారు.