'రామవరంలో నీటి ఎద్దడిని నివారించాలి'
BDK: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరంలో నీటి ఎద్దడి నివారించేందుకు చర్యలు తీసుకుని యుద్ధ ప్రాతిపదికన మంచినీళ్లు అందించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా అధికారులకు పిలుపునిచ్చారు. గురువారం రామవరంలోని కిన్నెరసాని భగీరథ పనుల పైప్ లైన్‌లను, నూతన ట్యాంకులను పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.