మధురానగర్‌లో కానిస్టేబుల్‌పై దాడి.. ముగ్గురు అరెస్ట్!
హైదారబాద్‌లోని మధురానగర్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రీకాంత్‌పై ఇటీవల దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడులను సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.