గ్యాస్ గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

గ్యాస్ గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

అనంతపురం రూరల్ మండలం ఆలమూరు వద్ద గల ఉమా భారతి ఇండియన్ గ్యాస్ గోడౌన్‌ను కలెక్టర్ ఓ. ఆనంద్ శుక్రవారం తనిఖీ చేశారు. గ్యాస్ సిలిండర్ల నిల్వ, భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనల ప్రకారం గ్యాస్ పంపిణీ జరుగుతుందో లేదో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని యాజమాన్యానికి సూచించారు.