గుండెజబ్బుతో బాధపడుతున్న విద్యార్థినికి శస్త్రచికిత్స
ASR: జీ.మాడుగుల ఏకలవ్య పాఠశాలలో 10 చదువుతున్న లోవకుమారి గుండెజబ్బుతో బాధ పడుతుంది. ఈ విషయం ప్రిన్సిపల్ శివసింగ్ చౌహాన్ గురుకుల కార్యదర్శి గౌతమి దృష్టికి తీసుకెళ్లారు. ఆమె స్పందించి, నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ సహకారంతో లోవకుమారిని విశాఖలో ఆసుపత్రిలో చేర్పించారు. గత నెల 27న శస్త్రచికిత్స చేసి, బుధవారం ఇంటికి తీసుకొచ్చామన్నారు.