VIDEO: మదనపల్లిలో కిందపడి యువకునికి గాయాలు

VIDEO: మదనపల్లిలో కిందపడి యువకునికి గాయాలు

అన్నమయ్య: మదనపల్లి మండలం శ్రీరామనవమి సందర్భంగా రామాలయంలో డెకరేషన్ లైట్లు అమర్చుతూ యువకుడు కిందపడి తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పేటీఎంకు చెందిన శ్రీనివాసులు కుమారుడు రాంబాబు (19) వేంపల్లి రామాలయంలో లైట్లు అమర్చే క్రమంలో కాలుజారి పడిపోయాడు. గాయపడిన అతడిని స్థానికులు వెంటనే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికు తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.