బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

GDWL: ఎర్రవల్లి మండలం ధర్మవరంలోని వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ సంతోష్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వంటగది, స్టోర్ రూమ్‌లను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, విద్య అందించాలని అధికారులను ఆదేశించారు. శిథిలావస్థకు చేరుకున్న తరగతి గదుల స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు.