ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్
ASR: పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భద్రపరిచిన ఈవీఎం గోదాములను, వివిధ ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ దినేష్ కుమార్ తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా శనివారం ఈవీఎం గోదాములను సందర్శించి, అక్కడ పరిస్థితులను గమనించారు. సీసీ కెమెరాల పనితీరును, ప్రధాన ద్వారానికి ఉన్న సీళ్లను పరిశీలించారు. భద్రతా ప్రమాణాలపై అక్కడ అధికారులకు సూచనలు చేశారు.