ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టినరోజు వేడుకలు..?
విశాఖపట్నంలోని విక్టోరియా ప్రభుత్వ ఆస్పత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ ఉషా ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడంపై వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ విచారణకు ఆదేశించారు. ఆసుపత్రుల్లో ప్రైవేటు వేడుకలు నిర్వహించకూడదని స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ, నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలున్నాయి. సిటిజన్స్ రైట్స్ ప్రతినిధి వై. సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.