నారాయణఖేడ్‌లో పోలింగ్ సిబ్బంది నిరసన
SRD: నారాయణఖేడ్ డివిజన్‌లో మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా 7 మండలాలకు చెందిన 196 గ్రామపంచాయతీల పోలింగ్ సిబ్బందికి మంగళవారం నారాయణఖేడ్ డిగ్రీ కళాశాల ఆవరణలో మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు. అయితే సగానికి పైగా సిబ్బందికి భోజనం అందకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ప్లేట్లు చేతబట్టి సిబ్బంది నిరసనకు దిగారు.