VIDEO: జగ్జీవన్ జయంతి నిర్వహించలేదని కలెక్టర్‌కు ఫిర్యాదు
JGL: రాయికల్ మండలం ధర్మాజీపేట గ్రామానికి చెందిన గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను సరైన విధంగా నిర్వహించలేదని ఆరోపించారు. ఈ విషయంపై గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఫోన్ ద్వారా సంప్రదించినా స్పందించలేదని తెలిపారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.