కేచుపల్లిలో దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణ
BHNG: వలిగొండ మండలం కేచుపల్లిలో MLA కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఆలేరు MLA బీర్ల ఐలయ్య, రాష్ట్ర కురుమ సంఘ అధ్యక్షుడు క్యామ మల్లేశం నిన్న పర్యటించారు. ఇందులో భాగంగా తెలంగాణ సాయుధ పోరాట యోధులు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దొడ్డి కొమురయ్య ధైర్య సాహసాలను స్మరించుకున్నారు.