శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పనుల పరిశీలన

ATP: గుత్తి మున్సిపాలిటీలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో డ్రైనేజీ మురికి నీరు రోడ్డు మీదకు పారాయి. దీంతో స్పందించిన మున్సిపాలిటీ అధికారులు గురువారం వార్డులో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డులో చేస్తున్న పనులను కమిషనర్ జబ్బర్మియా పరిశీలించారు.