ఈ నెల 13న జిల్లాలో జాతీయ లోక్ అదాలత్
KRNL: జిల్లాలో ఈ నెల 13న అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జీ.కబద్ధి తెలిపారు. శనివారం జిల్లా కోర్టులో జరిగిన సమావేశంలో పెండింగ్‌లో ఉన్న మోటార్ యాక్సిడెంట్, సివిల్, భూ సేకరణ, బ్యాంకు తదితర కేసులను రాజీ మార్గంలో త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.