బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలకు ట్రంప్ చురకలు
బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ మూసివేతతో ఇంధన కొరతతో జెట్ ఇంధనం పొందలేకపోతున్న బ్రిటన్ లాంటి దేశాలకు ట్రంప్ చురకలంటించారు. అలాంటి దేశాలు అమెరికా వద్ద ఉన్న ఇంధనాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. లేకపోతే ధైర్యం తెచ్చుకుని నేరుగా హర్మూజ్‌కు వెళ్లి మీకు కావాల్సింది లాక్కొండంటూ ఎద్దేవా చేశారు.