‘ఆదివాసీల హక్కులకు మాదే బాధ్యత’
అసోంలోని గోగముఖ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్(UCC)ను బీజేపీ అమలు చేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. అసోం ఆదివాసీల హక్కుల రక్షణకు కట్టుబడి ఉన్నామని, రాష్ట్ర అభివృద్ధి కేవలం ఎన్డీఏతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి మంత్రంతోనే తాము ముందుకు సాగుతున్నట్లు మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.