రక్తదానం ప్రాణదానంతో సమానం: MLA
SKLM: జలుమూరు మండల కేంద్రంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మంగళవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రక్తదానం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ప్రతి ఆరోగ్యవంతుడైన వ్యక్తి కనీసం ఏడాదిలో ఒక సారి రక్తదానం చేయాలని పేర్కొన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు.