VIDEO: 50 వేల విరాళం అందజేసిన.. ప్రభుత్వ ఉద్యోగురాలు
BHPL: రేగొండ మండలం తిరుమలగిరి శివారు బుగులోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం నాలుగో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ క్రమంలో భక్తురాలు నిఖిత స్వామి హుండీలో రూ.50వేలు సమర్పించారు. స్వామి దయతో ప్రభుత్వ ఉద్యోగం రావడంతో మొదటి జీతాన్ని కానుకగా ఇచ్చినట్లు ఆమె తెలిపారు.