జవాన్ మురళి నాయక్‌కు ఘనంగా నివాళులు

ATP: జమ్మూకశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న జవాన్ మురళి నాయక్‌పై పాకిస్థాన్ సైనికులు జరిపిన కాల్పుల్లో అసువులు బాసిన విషయం తెలిసిందే. శనివారం గుత్తిలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు మురళి నాయక్ మృతికి సంతాపం ప్రకటించి నివాళులర్పించారు. అమర్ రహే, అమర్ రహే మురళి నాయక్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి రామదాసు పాల్గొన్నారు.