తెలంగాణ రన్ 2026 పోస్టర్ ఆవిష్కరణ చేసిన సీఐ
జనగాం పట్టణంలో సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘తెలంగాణ రన్ 2026’ పోస్టర్‌ను సీఐ సత్యనారాయణ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మకుంట నుంచి షామీర్‌పేట వరకు 2, 5, 10 కిలోమీటర్ల విభాగాల్లో ఈ పరుగు నిర్వహించనున్నట్లు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రీడల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు.