ఇసుక అక్రమ హవా.. నిమ్మకు నీరెత్తిన యంత్రాంగం

ఇసుక అక్రమ హవా.. నిమ్మకు నీరెత్తిన యంత్రాంగం

KMM: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గమైన మధిరలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. చిన్నమండవ, తిమ్మినేనిపాలెం మున్నేరు వాగు నుంచి వందలాది ట్రాక్టర్లతో ఇసుక ఖమ్మం నగరానికి తరలిపోతోంది. ఇందిరమ్మ ఇళ్ల కూపన్ల ముసుగులో చెక్ పోస్టుల నుంచే ఈ రవాణా సాగుతుండటం గమనార్హం. అధికారులు పట్టించుకోకపోవడం వెనుక రాజకీయ నేతల హస్తం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.